Tummala Nageswara Rao : మంత్రి తుమ్మల పర్యటనకు అధికారుల డుమ్మా..సీరియస్ వార్నింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో అధికారుల గైర్హాజరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నోటీసులు కాదు.. డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటేనే సెట్ అవుతారు" అంటూ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Tummala Nageswara Rao : మంత్రి తుమ్మల పర్యటనకు అధికారుల డుమ్మా..సీరియస్ వార్నింగ్

విధాత : తన పర్యటనకు అధికారులు గైర్హాజర్ కావడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పర్యటనకు వస్తే అధికారులు రారా అంటూ అధికారుల తీరుపై మంత్రి తుమ్మల మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూసుకుంట, కొండరెడ్ల గ్రామాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు.

మంత్రి పర్యటనకు హాజరు కాని అధికారుల వివరణ తీసుకోవాలని..నోటీసులు కాకుండా ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే సెట్ అవుతారంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను, కలెక్టర్ వచ్చిన మీటింగ్ లకు కూడా డివిజనల్ అధికారులు డుమ్మా కొడితే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు.


ఇవి కూడా చదవండి :


CP Sajjanar : న్యూ ఇయర్ కి ఫ్యామిలీతో ఉంటారా..జైల్లో ఉంటారా?
Actor Shivaji : నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు