CP Sajjanar : న్యూ ఇయర్ కి ఫ్యామిలీతో ఉంటారా..జైల్లో ఉంటారా?

హైదరాబాద్ వార్షిక నేర నివేదికను సీపీ సజ్జనార్ విడుదల చేశారు. నగరంలో క్రైమ్ రేట్ 15% తగ్గగా, మహిళలు, పిల్లలపై నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. న్యూ ఇయర్ వేళ నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

CP Sajjanar : న్యూ ఇయర్ కి ఫ్యామిలీతో ఉంటారా..జైల్లో ఉంటారా?

విధాత, హైదరాబాద్ : న్యూ ఇయర్ కి ఫ్యామిలీతో ఉంటారా..జైల్లో ఉంటారా? అని హైదరాబాద్ నగర సీపీ వీసీ. సజ్జనార్ నగర వాసులకు వార్నింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలులో వేయడం ఖాయమని స్పష్టం చేశారు. జంటనగరాల్లో ఇప్పటికే ముమ్మురంగా న్యూ ఇయర్ డ్రంక్ ఆండ్ డ్రైవ్ నడుస్తుందని తెలిపారు. 2025 వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నగరంలో నేరాలు 15శాతం తగ్గాయని, సైబర్ క్రైమ్ కేసులు 8శాతం తగ్గాయని తెలిపారు. డ్రగ్స్ కేసులు తగ్గాయని..368కేసుల్లో రూ.6.4కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని వెల్లడించారు. మహిళలపై నేరాల సంఖ్య పెరిగిందని.. 2024 సంవత్సరంతో పోలిస్తే 6 శాతం మేర పెరిగిందని తెలిపారు. చిన్న పిల్లలపై నేరాల( ఫోక్సో కేసులు) విషయంలోనూ గతేడాదితో పోలిస్తే 27 శాతం పెరిగినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు.

గతేడాదితో పోలిస్తే రేప్ కేసులు తగ్గాయని.. మెుత్తం 405 కేసులు నమోదైనట్లు తెలిపారు. 2024తో పోలిస్తే హత్య కేసులు తగ్గాయని.. 69 కేసులు రికార్డైనట్లు ఆయన పేర్కొన్నారు. కిడ్నాపింగ్ కేసుల విషయంలోనూ పోయిన సంవత్సరంతో పోలిస్తే తగ్గాయని.. 166 మాత్రమే నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ప్రాపర్టీ వివాద కేసులు 64 శాతం మేర తగ్గాయి. నేరాల్లో శిక్షలు పడిన కేసుల సంఖ్య కూడా బాగా పెరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలపై 3,190, చీటింగ్ 4,536 కేసులు రికార్డ్ అయ్యాయని తెలిపారు. షీటీమ్స్‌కు సంబంధించి 1,114 కేసులు నమోదు అవ్వగా.. 3,817 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఆపరేషన్ స్మైల్ కింద 896 మంది పిల్లలను రెస్క్యూ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో మెుత్తం 1,247 మందిని రక్షించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో క్రైమ్ రేట్ పెరిగిందంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్ పైనా సీపీ సజ్జనార్ స్పందించారు. గతంతో పోలిస్తే హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్, క్రైమ్ రేట్అదుపులో ఉందన్నారు. గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందని తెలిపారు. ఒక్క సెన్సేషనల్ కేసుతో క్రైమ్ పెరిగినట్లు కాదని స్పష్టం చేశారు హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్, అదుపులోనే ఉందని చెప్పారు.

న్యూ ఇయర్ వేళ ‘జీరో డ్రగ్స్’ విధానమే లక్ష్యం

న్యూ ఇయర్ వేళ ‘జీరో డ్రగ్స్’ విధానమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపడుతున్నామని సజ్జనార్ తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు కచ్చితంగా రాత్రి 1 గంటకే మూసివేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే పబ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాటి లైసెన్సులను రద్దు చేస్తామని తేల్చిచెప్పారు.

నగరంలోని పబ్‌లు, హోటళ్లు రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించామని తెలిపారు. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపైనా మా నిఘా ఉంటుందని… గత రెండేళ్లలో డ్రగ్స్‌ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి కదలికలను నిశితంగా గమనిస్తున్నాం అని వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా చేసేవారు, వాటికి అలవాటు పడిన వారి జాబితా సిద్ధం చేసి వారిపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించాం అన్నారు. నగరానికి కొత్తగా వచ్చేవారి వివరాలనూ ఆరా తీస్తున్నాం’’ అని సీపీ సజ్జనర్ తెలిపారు. మాదకద్రవ్యాల నిరోధానికి జోన్‌కు ఒకటి చొప్పున 7 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

Bandi Sanjay : పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా?
Dandora | బ‌లగం సినిమా స్థాయిలో దండోరా ఉంది.. మంత్రి కోమ‌టి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు