FSL Fire Accident| ఎఫ్ఎస్ఎల్ డేటా సేఫ్ : డీజీ శిఖా గోయల్
నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రధాన కేసులకు సంబంధించి ప్రచారం జరుగుతున్నట్లుగా... ఎలాంటి డేటా నష్టపోలేదని ఎఫ్ఎస్ ఎల్ డైరక్టర్ జనరల్ శిఖా గోయల్ తెలిపారు. ప్రమాదం వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు.
విధాత, హైదరాబాద్ : నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి డేటా నష్టపోలేదని ఎఫ్ఎస్ ఎల్ డైరక్టర్ జనరల్ శిఖా గోయల్ తెలిపారు. ప్రమాదం వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. కార్యాలయంలో మంటలను మొదట ఎఫ్‌ఎస్‌ఎల్ ఉద్యోగి గుర్తించారు అని, మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తే.. సాధ్యపడలేదు అన్నారు. మంటలు క్రమంగా ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్‌కు వ్యాపించాయని తెలిపారు. అనాలసిస్ డాక్యుమెంట్ లో కొన్ని ఫైల్స్ దగ్దమయ్యాయని, వాటిని గుర్తించే పని కొనసాగుతుందన్నారు. ప్రమాదంలో 2015లో నమోదైన ఓటుకు నోటు కేసుకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి, అలాగే కొన్ని కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని దుష్ప్రచారం చేస్తున్నారు అని, వాటిలో నిజం లేదని, అలాంటి ప్రచారాలను ఎవరు నమ్మరాదని స్పష్టం చేశారు.
2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన ఓటుకు నోటు కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయని తెలిపారు. కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021 లో ఏసీబీ కోర్టుకు పొందపరిచామని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని వెల్లడించారు.ఇక్కడ ఆధారాలు కాలిపోయిన ఏసీబీ దగ్గర ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. ఈకేసులో ఆధారాలకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం జరుగలేదని తేల్చారు.
అలాగే 2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్ కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫ్‌ఎస్‌ఎల్‌కి వచ్చాయి అని, మిగతా మెటీరియల్ అసిస్ట్ చేశాం అని, ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి అని తెలిపారు. వీటిని రిట్రివ్ చేస్తాం అని స్పష్టం చేశారు. ప్రమాదంపై విచారణ జరుగుతుంది అని తెలిపారు. ప్రమాదంలో ఇంత వరకు ఎంత నష్టం జరిగిందన్నదానిపై స్పష్టత లేదు అని, ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram