Harshaveena video| డిప్యూటీ సీఎం పవన్‌ను కలుస్తా: హర్షవీణ మరో వీడియో విడుదల
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఎలాగైనా కలవాలని ఓ వీడియో విడుదల చేసింది. నా సమస్య మీకు ఎంతవరకు తెలిసిందో నాకు తెలియదని..అందుకే మిమ్నల్ని కలిసి వివరిస్తానంటూ వీడియోలో పేర్కొంది.
అమరావతి : ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు హర్షవీణ వరుస వీడియోలతో సంచలనం రేపుతున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర తనను ఎలా బెదిరించి లొంగదీసుకుని మోసం చేశాడో వివరిస్తూ ఇప్పటికే హర్షవీణ విడుదల చేసిన వీడియోలు ఏపీ రాజకీయాలను, ముఖ్యంగా జనసేనను కుదిపేశాయి. ఆమె ఆరోపణలపై స్పందించిన జనసేన అగ్రనాయకత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఓ దశలో హర్షవీణ ఆరోపణలను త్రోసిపుచ్చిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తర్వాతా ఈ వివాదం మా వ్యక్తిగతం అంటూ చెప్పుకొచ్చారు. ఈ వివాదంలో జనసేన నాయకత్వం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతలోనే బాధిత మహిళ హర్షవీణ మరో వీడియో విడుదల చేసింది.
తాజా వీడియోలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఎలాగైనా కలవాలని.. నా సమస్య మీకు ఎంతవరకు తెలిసిందో నాకు తెలియదని..వీలైనంత త్వరగా ఈ వీడియో డిప్యూటీ సీఎంకి చేరేలా చూడాలని జనసేన పార్టీ నాయకులను కోరింది. నేను చేస్తున్న ఉద్యోగం పవన్ పర్యవేక్షణలోని మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉన్నందునా మిమ్నల్ని కలిసే చాన్స్ ఇప్పించడని వీణ కోరింది. జరిగిన సంఘటనలో తప్పు తనదే అయితే శిక్ష వేయించుకోవడానికి సిద్ధమని వీడియోలో పేర్కొంది.
మరో వీడియో విడుదల చేసిన జనసేన ఎమ్మెల్యే బాధిత మహిళ
నా విషయం డిప్యూటీ సీఎం @PawanKalyan కు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. నేను ఆయనను కలవాలని అనుకుంటున్నాను.
నాదే తప్పు అయితే నేను ఏ శిక్షకైనా సిద్ధం, నాది తప్పు కాకపోతే నాకు #PawanKalyan న్యాయం చేయాలి – బాధిత మహిళ pic.twitter.com/k9ia6Tn2fK
— greatandhra (@greatandhranews) February 8, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram