CP Sajjanar | అది కేవ‌లం దారం కాదు.. గాలిలో వేలాడే ప‌దునైన క‌త్తి.. సీపీ స‌జ్జ‌నార్ కీలక వ్యాఖ్య‌

CP Sajjanar | హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలో చైనా మాంజా త‌గిలి ఓ ఐదేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

  • By: raj |    telangana |    Published on : Jan 27, 2026 10:30 AM IST
CP Sajjanar | అది కేవ‌లం దారం కాదు.. గాలిలో వేలాడే ప‌దునైన క‌త్తి.. సీపీ స‌జ్జ‌నార్ కీలక వ్యాఖ్య‌

CP Sajjanar | హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలో చైనా మాంజా త‌గిలి ఓ ఐదేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

గుండె తరుక్కపోతోంది.. అభంశుభం తెలియని ఈ ఐదేళ్ల చిన్నారి చేసిన నేరమేంటి!? అని స‌జ్జ‌నార్ ప్ర‌శ్నించారు. నాన్న బైక్ ముందు సీట్లో కూర్చుని, ఇంటికి వెళ్తున్నామని సంబరపడే లోపే.. మృత్యువు ‘మాంజా’ రూపంలో ఆమె మెడకు చుట్టుకుంది. ఆ చిన్నారి గొంతు తెగిపోతుంటే ఆ తండ్రి పడ్డ ఆవేదనకు ఎవరు బాధ్యులు? అని నిల‌దీశారు.

సంక్రాంతి అంటే సంతోషాలు పంచుకోవడం.. ఇలా శోకాన్ని మిల్చడం కాదు కదా. కొందరు తమ ఆనందం కోసం వాడే చైనా మాంజా ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. గుర్తుంచుకోండి.. అది కేవలం దారం కాదు, గాలిలో వేలాడే పదునైన కత్తి. దయచేసి ప్లాస్టిక్/నైలాన్ మాంజాను వాడకండి. పిల్లల చేతికి మరణాయుధాలను ఇవ్వకండి అని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. చైనా మాంజా అమ్మితే ఉపేక్షించం.. వాడితే వదిలిపెట్టం అని హైద‌రాబాద్ సీపీ హెచ్చ‌రించారు.