తెలంగాణలో విధ్వంసకర చర్యలను ప్రేరేపిస్తూ మాట్లాడిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను వెంటనే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌లు బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్ డీజీపీ ఆనంద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బల్మూరి మాట్లాడుతూ..బాల్క సుమన్ లాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం అంత మంచింది కాదు. పోలీసులు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని డీజీపీని కోరినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, రెచ్చగొట్టారని, ప్రభుత్వంపై కుట్ర పన్నారు, ఈ కోణంలోనూ కేసు నమోదు చేయాలని, నేరం చేయడం ఎంతో తప్పో, దానిని ప్రోత్సహించేలా మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కూడా అంతే నేరం అన్నారు.

బాల్క సుమన్ ఓ సంఘ విద్రోహ శక్తిగా, టెర్రరిస్టు తరహాలో మాట్లాడారని, తన రాజకీయ ఎదుగుదల, స్వార్థం కోసం ఎంతో మంది జీవితాలను పణంగా పెట్టించాడని, సుమన్ ను వెంటనే అరెస్ట్ చేసి జైళ్లో వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టాలి. రైలు పట్టాలని తగలబెట్టండి, కొయ్యండని అని మాట్లాడిన బాల్క సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల మసుగులో ఉన్నది బీఆర్ఎస్ నేతలే అని, ప్రజా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుట్ర పనుతున్నారని ఆరోపించారు. బాల్క సుమన్ వెనుక ఎవరున్నారనే కుట్రలు బయట పెట్టాలని డీజీపీకి విజ్ఞప్తి చేశామన్నారు.

కేసీఆర్ ఆటలు సాగనివ్వం : అద్దంకి

ఫామ్ హౌస్ లో కూర్చోని బాల్క సుమన్ వంటి వారితో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు, సంఘ విద్రోహ చర్యలను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, ఆయన ఆటలు సాగనివ్వబోమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. అధికారం కోసం దిగజారి ఫామ్ హౌజ్ లో కూర్చొని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. కేటీఆర్, హరీశ్ రావు, సుమన్ లాంటి వాళ్లంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు, రాష్ట్రంలో శాంతిభద్రతలను నాశనం చేసేందుకు తలో వర్గాన్ని రెచ్చగొడుతున్నారని అద్దంకి ఆరోపించారు. కేసీఆర్ కు తెలువకుండా వాళ్లు మాట్లాడరన్నారు. సంఘ విద్రోహ చర్యలను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్… సోదరుడని పిలిచే వ్యక్తి బాల్క సుమన్ శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతుంటే… బాల్క సుమన్ ను కేటీఆర్ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ కు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉండి, ప్రజల బాగుండాలంటే తక్షణమే బాల్క సుమన్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

రాజ్యసభకు సిద్దరామయ్య…సీఎంగా డీకే శివ‌కుమార్!
కేర‌ళం మాజీ సీఎం విజ‌య‌న్ నివాసంలో ఈడీ సోదాలు