Deccan Cement Factory | ద‌క్క‌న్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. పోలీసుల‌పై బీహార్ కార్మికుల రాళ్ల‌ దాడి.. వీడియో

Deccan Cement Factory | బీహార్ కార్మికులు( Bihar Workers ) రెచ్చిపోయారు. పోలీసుల‌పై( Police ) రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు. కార్మికుల దాడిలో ప‌లువురు పోలీసుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా( Suryapeta District ) పాల‌క‌వీడు మండ‌లంలోని ద‌క్క‌న్‌ సిమెంట్ ఫ్యాక్ట‌రీ( Deccan Cement Factory  )వ‌ద్ద చోటు చేసుకుంది.

  • Publish Date - September 23, 2025 / 09:01 AM IST

Deccan Cement Factory | సూర్యాపేట : బీహార్ కార్మికులు( Bihar Workers ) రెచ్చిపోయారు. పోలీసుల‌పై( Police ) రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు. కార్మికుల దాడిలో ప‌లువురు పోలీసుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా( Suryapeta District ) పాల‌క‌వీడు మండ‌లంలోని ద‌క్క‌న్‌ సిమెంట్ ఫ్యాక్ట‌రీ( Deccan Cement Factory  )వ‌ద్ద చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ద‌క్క‌న్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ మూడో గ‌నిలో ప్ర‌యివేటు ఏజెన్సీ ద్వారా నియ‌మితుడైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వినోద్(45) ఆదివారం కార్మికుల కాల‌నీలో త‌న గ‌ది వ‌ద్ద దుస్తులు ఉతికేందుకు వెళ్లి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన తోటి కార్మికులు.. ఫ్యాక్ట‌రీలోని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. మిర్యాల‌గూడ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ క్ర‌మంలో వినోద్ కుటుంబానికి ప‌రిహారం అందించాల‌ని ఏజెన్సీ వారితో కార్మికులు చ‌ర్చ‌లు జ‌రిపారు. చ‌ర్చ‌లు ఫ‌లించ‌క‌పోవ‌డంతో.. దాదాపు 250 మంది కార్మికులు ఫ్యాక్ట‌రీ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. వారిని చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు య‌త్నించ‌గా, ఎస్ఐ కోటేశ్, హోంగార్డు గోపీ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పోలీసుల‌ను ప‌రుగెత్తించి కొట్టారు. క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడి చేశారు. పోలీసు వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు.

ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌డంతో కోదాడ రూర‌ల్, మున‌గాల సీఐలు ప్ర‌తాప‌లింగం, రామ‌కృష్ణా రెడ్డి, నేరేడుచ‌ర్ల‌, గరిడేప‌ల్లి, మ‌ఠంప‌ల్లి ఎస్ఐలు ర‌వీంద‌ర్, న‌రేశ్, బాబు త‌మ పోలీసు బృందాల‌తో వ‌చ్చి ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.