Site icon vidhaatha

మాధ‌విలతపై కేసు కాంగ్రెస్ – ఎంఐఎంల‌ కుట్ర‌నే: సుధాక‌ర్ గాందే

*కాంగ్రెస్‌-ఎంఐఎంలు తోడు దొంగ‌లు

*హిందువుల‌పై నోరుపారేసుకున్న అస‌దుద్దీన్ సోద‌రుల‌పై చర్య‌లేవీ?

హైద‌రాబాద్‌: హైద‌రాబాద్ ఎంపీ బీజేపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌త‌పైన పెట్టింది త‌ప్పుడు కేసు అని మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ కో క‌న్వీన‌ర్ సుధాక‌ర్ గాందే ఒక ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం, ఎంఐఎం పార్టీ తోడు దొంగ‌లు అని ఈ కేసుతో స్పష్టంగా అర్థ‌మైందని ఆయ‌న ఆరోపించారు. శ్రీ‌రామ‌న‌వ‌మి రోజు ఎంపీ అభ్య‌ర్థి మాధ‌వి ల‌త ప్ర‌సంగంలో ఎక్క‌డా ముస్లింల‌ను కించ‌ప‌ర‌చ‌లేదని, ఆమె బాణం చూపిన దిక్కున మ‌సీదు ఉండ‌టం యాదృచ్ఛికమేనన్నారు. అందుకు ఆమె ఇప్ప‌టికే క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పార‌ని సుధాక‌ర్ గుర్తు చేశారు. అలా కేసులు పెట్టాల్సి వ‌స్తే ఎంఐఎం పార్టీ నాయ‌కులు, ముఖ్యంగ అస‌దుద్దీన్ ఓవైసీపైన ఎన్ని కేసులు న‌మోదు చేయాలి అని ఆయ‌న ప్ర‌శ్నించారు. నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌సిద్ధ ర‌చ‌యిత త‌స్లీమా న‌స్రీన్‌పైన సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ఎంఐఎం నేత‌లు దాడి చేశార‌ని దానిపై నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏం చ‌ర్య‌లు తీసుకుంద‌ని సుధాక‌ర్ ప్ర‌శ్నించారు.

అస‌దుద్దీన్ సోద‌రుడు అక్బ‌రుద్దీన్ హిందూవులంతా ఆవులు. గ‌డ్డి తింటారు. ముస్లింలు అంతా పులులు మాంసం తింటారు. పులి ఆవును వేటాడి తిన్న‌ట్లే ముస్లింలు హిందువులను వేటాడాలి అంటూ హిందూవుల‌పై నోరు పారేసుకున్నార‌ని, దీనిపై నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏం చ‌ర్య‌లు తీసుకుందని ప్ర‌శ్నించారు. ఒక గంట సేపు పోలీసులు, చ‌ట్టం స‌హ‌క‌రిస్తే ముస్లింల ప‌వ‌రేంటో చూపిస్తామ‌న్న అక్బ‌రుద్దీన్ బ‌లుపు మాట‌ల‌పై ఏం కేసులు పెట్టారు? ఎంఐఎం నేత‌లు ఇంత రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేసినా వారిపై క‌నీసం ఎఫ్ ఐ ఆర్ న‌మోదుచేయ‌లేని కాంగ్రెస్ ప్ర‌భుత్వం….మాధ‌వీల‌త బాణం మ‌సీదువైపు చూపించి సైగ చేసింద‌నే దానిపై త‌ప్పుడు కేసు న‌మోదు చేయ‌డం బ్లాక్‌మెయిలింగ్ రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ట‌గా సుధాక‌ర్ అభివ‌ర్ణించారు. కాంగ్రెస్ పాల‌న‌లో ముస్లింల‌కు ఒక రూలు, మెజార్టీలుగా హిందువుల‌కు ఒక రూల్ అని, అందుకే కాంగ్రెస్‌ను దేశం నుంచి త‌రిమికొట్టాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చిన విష‌యాన్ని గుర్తుచేశారు.

కాంగ్రెస్‌-ఎంఐఎం పార్టీల ఉడుత ఊపుల‌కు బీజేపీ అద‌ర‌దు, బెద‌ర‌దని, ఈసారి మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, హైద‌రాబాద్ పార్ల‌మెంటు స్థానాల‌పై బిజేపీ జెండా ఎగ‌ర‌వేయ‌నున్న‌ట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు ఇప్ప‌టికే బీజేపీ ఖాతాలో ప‌డిపోయాయ‌ని సుధాక‌ర్ గాంధే తెలిపారు. మోడీ పాల‌న‌, మోడీ దేశంప‌ట్ల‌, ధ‌ర్మం ప‌ట్ల అనుస‌రిస్తున్న విధానాలు కేంద్రంలో మ‌రోసారి బీజేపీకి 400 సీట్లు తెచ్చిపెడ‌తాయ‌ని సుధాక‌ర్ గాందే జోస్యం చెప్పారు. గెల‌వ‌క‌ముందే కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు హిందువులను ఇంత‌గా అణ‌చివేసే కుట్ర‌కు తెర‌లేపుతున్నాయ‌ని, హిందూ బంధువులు మేలుకోని ఓటు ద్వారా ఆ పార్టీల‌కు బుద్ధి చెప్ప‌క‌పోతే భ‌విష్య‌త్ ఊహించుకోలేమ‌న్నారు.

Exit mobile version