BRS MLC Kavitha : అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కవిత
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది.

BRS MLC Kavitha | విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న కవితకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తన చిన్న కుమారుడు ఆర్యను కళాశాలలో చేర్చేందుకు కవిత ఈనెల ఆగస్టు 16న అమెరికాకు వెళ్లారు.
15 రోజుల అమెరికా పర్యటన అనంతరం ఆమె తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న కవిత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐ విచారణ జరిపించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలపై ఏ విధంగా స్పందించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.