Sridhar Reddy | బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్య
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్య కు గురయ్యారు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది
వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో దారుణం
ఆరుబయట నిద్రిస్తున్న సమయం లో గొడ్డళ్ళతో నరికి చంపిన దుండగులు
మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు
రాజకీయ హత్యా… లేదా భూతగాదాల అనే కోణం లో పోలీసుల దర్యాప్తు
హత్యను ఖండించిన కేటీఆర్, హరీష్ రావు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్య కు గురయ్యారు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం లోని చిన్నంభావి మండలం లక్ష్మి పల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి బుధవారం రాత్రి తన ఇంటి ఆరుబయట మంచం పై నిద్రిస్తున్న సమయం లో కొందరు దుండగులు గొడ్డళ్ళతో దాడి చేసి దారుణంగా హతమార్చారు.
కాగా.. తల, గొంతు పై నరకడం తో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన నియోజకవర్గం సంచలనం రేపింది.శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లో చురుకైన నేతగా ఉంటూ మాజీ ఎమ్మెల్యే హరవర్ధన్ రెడ్డి కి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు.ఇది రాజకీయ హత్యా లేదా భూతగాదాల హత్యా అనేది విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఈ హత్య ను ఖండించారు. లక్ష్మి పల్లి గ్రామానికి కేటీఆర్ వస్తున్నట్లు సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram