BJP l డాక్టర్ ప్రీతి మృతికి నిరసనగా BJP ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
Candle rally under the auspices of BJP విధాత, మెదక్ బ్యూరో: డాక్టర్ ప్రీతి నాయక్ మృతికి సంతాప సూచకంగా జిల్లా కేంద్రమైన మెదక్‌లో భారతీయ జనతా పార్టీ(BJP) అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల (Candle)ను వెలిగించి ర్యాలీ నిర్వహించారు. మెదక్ పట్టణంలోని స్థానిక రామాలయం(Ramalayam) నుండి శివాజీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ ప్రీతి నాయక్ తన సీనియర్ సైఫ్ వేధింపులు […]
Candle rally under the auspices of BJP
విధాత, మెదక్ బ్యూరో: డాక్టర్ ప్రీతి నాయక్ మృతికి సంతాప సూచకంగా జిల్లా కేంద్రమైన మెదక్‌లో భారతీయ జనతా పార్టీ(BJP) అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల (Candle)ను వెలిగించి ర్యాలీ నిర్వహించారు.

మెదక్ పట్టణంలోని స్థానిక రామాలయం(Ramalayam) నుండి శివాజీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ ప్రీతి నాయక్ తన సీనియర్ సైఫ్ వేధింపులు భరించలేనని పలుమార్లు అధికారులకు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో ఆత్మహత్య చేసుకుందన్నారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, ర్యాగింగ్(Raging) పేరిట అమ్మాయిలను వేధింపులకు గురి చేయడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, నల్లాల విజయ్, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, వెల్దుర్తి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కల దేవి మధు గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎస్టీ మోర్చా అధ్యక్షులు రెడ్యానాయక్, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, కల్కి నాగరాజు, ఆకుల రాము, శంకరంపేట మండల అధ్యక్షులు రాజు, మెదక్ మండల అధ్యక్షులు ప్రభాకర్, పాపన్నపేట మండల అధ్యక్షుడు సంతోష్, అశోక్ మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram