Chenchu Woman | నాగర్‌కర్నూల్ : గాఢ నిద్రలో ఉన్న భర్త( husband ) పురుషాంగాన్ని( Private Parts ) ఓ భార్య( Wife ) గొడ్డలితో నరికేసింది. ఈ దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా( Nagarkurnool District ) పరిధిలోని లింగాల మండలం( Lingala Mandal )లో గత వారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. లింగాల మండల పరిధిలోని ఓ చెంచు గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులు( Couples ) నిత్యం గొడవ పడుతున్నారు. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. గత వారం కూడా దంపతులిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయింది.
ఇక భర్త గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత.. అతని పురుషాంగాన్ని గొడ్డలితో నరికేసింది. దీంతో భర్త గట్టిగా కేకలు వేసేసరికి ఇరుగుపొరుగు వారు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన బాధితుడిని చికిత్స నిమిత్తం లింగాల ఆస్పత్రి( Lingala hospital )కి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి( Osmania Hospital )కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.