Site icon vidhaatha

Sabita Indra Reddy | సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంల మాటలు బాధకరం…కన్నీటి పర్యంతమైన సబితా ఇంద్రారెడ్డి

విధాత, హైదరాబాద్ : నాపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు శాసన సభలో చేసిన వ్యాఖ్యలు ఎంతో భాధకల్గించాయని మాజీ మంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. శాసన సభ మీడియా పాయింట్‌లో సబిత మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని, సభలో మాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందంటూ మహిళలను అవమానించే విధంగా సీఎం మాట్లాడారని ఆక్షేపించారు. “సభలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని, సీఎం అలా ఎందుకుమాట్లాడారో మాకు అర్థం కాలేదన్నారు. బడ్జెట్‌పై కేటీఆర్ ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారని, కేటీఆర్ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. నా గురించి, సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశారని చెప్పారని, మేం ఉన్న పార్టీలో నిబద్ధతగా పనిచేశామని, పార్టీ మారారంటున్న వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చారో ఆలోచించుకోవాలన్నారు. అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండ్ అవుంతుందంటున్నారని, ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరతారన్నారు. నమ్ముకున్న వాళ్లకు ప్రాణమైనా ఇస్తాం కానీ, మోసం చేయమని, సబిత, సునీతకు జరిగిన అవమానం కాదిదని, యావత్ తెలంగాణలోని ఆడబిడ్డలకు జరిగిన అవమానంగా భావిస్తున్నామన్నారు. గత 24 ఏళ్ల నుంచి అసెంబ్లీకి వస్తున్నా, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరించారన్నారు. మీరు మాట్లాడిన మాట ప్రతి ఇంటా ప్రతి ఆడబిడ్డకు తగులుతుందని కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే ఏ మొహం పెట్టుకుని వచ్చారంటూ చేసిన మాట చాల బాధ అనిపిస్తుందన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సీఎం సీటులోనే కూర్చున్నారంటే ఒక ఇందిరమ్మ, సోనియమ్మ, లేదా సబితమ్మ పుణ్యాననే కావచ్చన్నది దేశ ప్రజలందరికి తెలుసన్నారు. మీరు మాపై మాట్లాడి వెళ్లిపోయారని, మాకు తిరిగి సమాధానం చెప్పేందుకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగలా పారిపోయారని, మా సమాధానం వినే ధైర్యం మీకు లేదా అని ప్రశ్నించారు.

Exit mobile version