Harish Rao | సభను తప్పుదోవ పట్టిస్తున్నసీఎం రేవంత్ … మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు

పాలక పక్షం ఆత్మరక్షణ లో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ,సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభ ను పక్క దారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి టి .హరీష్ రావు ఆరోపించారు.

Harish Rao | సభను తప్పుదోవ పట్టిస్తున్నసీఎం రేవంత్ … మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు

సభా హక్కుల తీర్మానం ఇస్తాం
కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే రేవంత్ చంద్రబాబు తోనే ఉండే వాడు

విధాత: పాలక పక్షం ఆత్మరక్షణ లో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ,సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభ ను పక్క దారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి టి .హరీష్ రావు ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రతి సమవేశం లొనూ ఇదే జరుగుతోందన్నారు. సభను తప్పుతోవ పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల తీర్మానం ఇస్తామని చెప్పారు. సభా నాయకుడు ఆదర్శంగా ఉండాల్సింది పొయి సభలో అబద్దాలు మాట్లాడుతున్నారని చెప్పారు. పోతిరెడ్డి పాడు పై వై ఎస్ హాయం లో మేము పదవుల కోసం పెదవులు మూసుకున్నామఅని రేవంత్ మా పై ఆరోపణలు చేశారని, పోతిరెడ్డి పాడు పై జీ ఓ రాకముందే మేము వై ఎస్ కేబినెట్ నుంచి వైదొలిగామని, కానీ పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డే అని ఆరోపించారు. ఇప్పడు తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్టు రేవంత్ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారన్నారు.

తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేసాం కానీ .రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జారిగాయన్నారు. కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే ఈ రేవంత్ చంద్రబాబు తోనే ఉండే వాడన్నారు. అలాంటి రేవంత్ తెలంగాణ ఛాంపియన్ ను తానే అని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదేనన్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినా ఇపుడు సీఎం అయినా అది తెలంగాణ వచ్చిన ఫలితమే ..కేసీఆర్ పుణ్యమేనన్నారు.

అన్నీ ద్వంద్వ ప్రమాణాలే

బీ ఆర్ ఎస్ పని అయిపోయింది అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ కు గతం లో దేశం లో రాష్ట్రం లో ప్రతిపక్ష హోదా రాలేదు అయినా ఆ పార్టి పని అయిపోయిందా ? అని అన్నారు. ఇండియా కూటమి 28 పార్టీలతో ఏర్పడిందని, అందులో కాంగ్రెస్ గెలిచిన సీట్లు 99 మాత్రమేనన్నారు. జైపాల్ రెడ్డి పెద్ద తెలంగాణ వాది తాను చిన్న తెలంగాణ వాది అని రేవంత్ మాట్లాడుతున్నారని, జైపాల్ రెడ్డి తెలంగాణ కు ఏ పార్టీ నైనా ఒప్పించారా ?కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించారన్నారు. మీడియా కూడా రేవంత్ అబద్దాలను ఎండ గట్టాలన్నారు. రుణ మాఫీ పై రేవంత్ ది గోబెల్స్ ప్రచారమని, 31 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ అవుతుందని 25 వేల కోట్లే బడ్జెట్ లో పెట్టారని తెలిపారు.