సీఎంగా ఆరుగ్యారంటీలపై తొలి సంతకం చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ ఆరు గ్యారంటీల అమలుకు అభయహస్తం చట్టంపై తొలి సంతకం చేశారు

విధాత : తెలంగాణ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ ఆరు గ్యారంటీల అమలుకు అభయహస్తం చట్టంపై తొలి సంతకం చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి తను ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగ మరుగుజ్జు తుమ్మల రజినికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ రెండో సంతకం చేశారు.
ప్రమాణస్వీకారానికి హాజరైన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల హర్షద్వానాల మధ్య రేవంత్ తొలి, మలి సంతాలను చేసి కాంగ్రెస్ ఎన్నికల హామీ అమలు దిశగా ముందడుగు వేశారు. అనంతరం వేద పండితులు, వివిధ మత పెద్దలు రేవంత్‌కు ఆశీర్వచనాలు పలికారు.
సీఎంగా తన తొలి ప్రసంగంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇక మీదట ప్రగతిభవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా నామకరణం చేశామని, ఇంతకాలం అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించామని, తొలి ప్రజాదర్భార్‌ను రేపు శనివారం నిర్వహిస్తామని, ప్రజలంతా స్వేచ్చగా రావచ్చని ప్రకటించారు.