Telangana Rain Alert | భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు..వరదలపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సీఎస్, ఉన్నతాధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు మరో రెండు రోజులు భారీ వర్షాలు పడనుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. జంటనగరాలతో పాటు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అంతా అందుబాటులో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని సీఎస్ ను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram