• Telugu News
  • /Telangana

Rythu Bharosa | మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్ రెడ్డి

Rythu Bharosa | మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం రూ.9000 కోట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

Reported by: raj | తెలంగాణ‌ | Feb 04, 2026, 10:16 pm IST
Read Time: 3 mins
Rythu Bharosa | మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్ రెడ్డి

Rythu Bharosa | విధాత: మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం రూ.9000 కోట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గత రెండేళ్లలో.. అన్నివర్గాల ప్రజలంకోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టింది అన్నారు. మా రెండేళ్ల పాలన చూసి ఓటేయాలని పట్టణ ప్రజలను కోరారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో.. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు అని, ఆనాడు దొడ్డు బియ్యం మిల్లులకు అమ్ముకొని, గేదెలకు పెట్టారు అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అని గుర్తు చేశారు. రాష్ట్రం ఆసియాలో ఎక్కువ వరి పంట పండిస్తోంది.. మిల్లింగ్ చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో.. వరి వేస్తే ఉరి అన్నారు. నేడు.. సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం.రైతు రుణమాఫీ చేశాం అని, రైతు భరోసా ఇస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా విడుదల చేస్తామని, రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నామని స్పష్టం చేశారు.