Medaram | మేడారంలో కొండెక్కిన కొబ్బరికాయ ధరలు..! గజం స్థలం రూ. 10 వేల పైమాటే..!!
Medaram | ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం మహా జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వన దేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Medaram | ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం మహా జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వన దేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే జాతర నేపథ్యంలో కొబ్బరికాయలు, బెల్లం, వాటర్ బాటిల్స్, బొమ్మల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య భక్తులు కొనలేని పరిస్థితి ఏర్పడింది.
కొబ్బరికాయలు, నీళ్ల బాటిల్స్ నుంచి మొదలుకుంటే.. సత్రాల వరకు రేట్లను అమాంతం పెంచేశారు. రూ. 30కి దొరికే కొబ్బరికాయను రూ. 50కి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బెల్లం పెద్ద ముద్దలను రూ. 70, చిన్న ముద్దలను రూ. 100(అసలు ధర రూ. 70), లీటర్ వాటర్ బాటిల్ రూ. 30, పిల్లల బొమ్మలు రూ. 100(అసలు ధర రూ. 60)కు విక్రయిస్తూ ఉన్నారు. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే నాటుకోడి(కిలో) రూ. 600, మేకపోతు మాంసం కిలో రూ. 700, గొర్రె మాంసం కిలో రూ. 650 కి విక్రయిస్తూ దందా కొనసాగిస్తున్నారు.
పది రోజుల క్రితం సాధారణ గది రోజుకు రూ. 2 వేల చొప్పున కిరాయికి ఇవ్వగా, ఇప్పుడే అదే గది రూ. 4 వేలు పలుకుతోంది. ఏసీ గది కిరాయి రూ. 5 వేలు(పది రోజుల క్రితం రూ. 2500) పలుకుతుంది. మహాజాతరలో గజం స్థలం అద్దె గత ఏడాది రూ. 3500 నుంచి రూ. 4 వేలు ఇండ.. ఇప్పుడు ఆ ధరలు రెట్టింపు అయ్యాయి. ఈ ఏడాది ఏకంగా రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు చేరింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram