Telangana Congress | ఈ నెల 18న కాంగ్రెస్ శాసనసభా పక్షం భేటీ.. 20న వరంగల్‌లో కాంగ్రెస్ రైతు బహిరంగ సభ

ఈ నెల 18న కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) భేటీ కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha Elections), పార్టీ కార్యక్రమాల ఆమలు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

Telangana Congress | ఈ నెల 18న కాంగ్రెస్ శాసనసభా పక్షం భేటీ.. 20న వరంగల్‌లో కాంగ్రెస్ రైతు బహిరంగ సభ

హాజరుకానున్న సోనియా, రాహుల్‌గాంధీలు
అదే రోజు సచివాలయం ముందు రాజీవ్ విగ్రహావిష్కరణ

Telangana Congress | ఈ నెల 18న కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) భేటీ కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha Elections), పార్టీ కార్యక్రమాల ఆమలు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే బీఆరెస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల చేరిక అంశం కూడా చర్చకు రావచ్చని తెలుస్తుంది. తన ఢిల్లీ పర్యటన వివరాలు.. అధిష్టానం ఆలోచనలు..రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పాలన విధానాలు వంటి అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.

నామినేటెడ్ పదవుల వ్యవహారంపై కూడా సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు ప్రస్తావించే అవకాశముంది. రైతు రుణమాఫీ నేపధ్యంలో వరంగల్‌ (Warangal)లో ఈ నెల 20న బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభకు సోనీయాగాంధీ (Sonia Gandhi), రాహుల్‌గాంధీ (Rahul Gandhi)లు హాజరవుతారని సమాచారం. అదే రోజు హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ విగ్రహాన్ని వారు ఆవిష్కరిస్తారని, అనంతరం వరంగల్ సభకు హాజరవుతారని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలకు మార్గదర్శకం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.