బెల్టు షాపులు ఎత్తివేయాలని నిరసన.. వైరల్‌గా మారిన డిగ్రీ విద్యార్థి ఆందోళన

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామంలో డిగ్రీ విద్యార్థి నవీన్ వినూత్న నిరసన చేపట్టారు. ఊరిలోని పిల్లలతో కలిసి గ్రామకూడలిలో టెంట్ వేసుకుని ధర్నాకు దిగాడు

  • Publish Date - May 19, 2024 / 05:25 PM IST

విధాత: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామంలో డిగ్రీ విద్యార్థి నవీన్ వినూత్న నిరసన చేపట్టారు. ఊరిలోని పిల్లలతో కలిసి గ్రామకూడలిలో టెంట్ వేసుకుని ధర్నాకు దిగాడు. గ్రామంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు బెల్ట్ షాప్ లలో మద్యం విక్రయిస్తున్నారని, వాటిని వెంటనే మూసివేయాలని గ్రామ కూడలిలో నిరసనకు దిగాడు. గ్రామంలో పెద్దవారు పనులు మానేసి తాగడమే పనిగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులను పట్టించుకోవడం లేదని వాపోయాడు. గ్రామంలో బెల్ట్ షాపులు మూతపడే వరకు తన నిరసనను కొనసాగిస్తానని తెలిపాడు. బెల్ట్‌షాపులపై నవీన్ చేపట్టిన నిరసన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Latest News