కవిత పార్టీ టీఆర్ఎస్ కు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌!

కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘తెలంగాణ రాష్ట్ర సేన’కు బదులు ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ పేరును ఆమోదించింది.

కల్వకుంట్ల కవిత ఇటీవల ప్రకటించిన టీఆర్‌ఎస్(TRS) పార్టీ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర సేన బదులు ‘ తెలంగాణ రక్షణ సేన’ పేరును ఆమోదించింది.

ఈ నెల 25న మేడ్చల్‌లో నిర్వహించిన సమావేశంలో కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా(TRS) ప్రకటించారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పేరును ఆమోదిస్తూ.. కవిత నివాసంలో లేఖ అందజేసింది.

మేడ్చల్ సభలో పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించిన కవిత ..ఎన్నికల సంఘానికి చేసిన దరఖాస్తులో ఆ పేరును మాత్రం చేర్చకపోవడం గమనార్హం. ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయని  ‘ తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో కవిత తన  కొత్త పార్టీ ప్రకటన చేయడం ద్వారా ఆమె ప్రజలను మోసగించారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పార్టీ పేరును అధికారికంగా ట్వీట్ చేసిన కవిత

కవిత తన పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేన గా పేర్కొంటూ అధికారికంగా ట్వీట్ చేసింది. కవిత తన కొత్త పార్టీ పేరు కోసం .. జనవరిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పేర్లను ఈసీకి పంపించారు. వాటిలో మూడో ప్రాధాన్యతగా పేర్కొన్న  ‘తెలంగాణ రక్షణ సేన’ పేరును సీఈసీ  ఆమోదించింది. దీనిపై స్పందించినకవి…టీఆర్‌ఎస్‌.. నాకు రాసిపెట్టి ఉందేమో!  రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం చేస్తున్న కృషిని కొనసాగిస్తా. రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తా’’ అని కవిత ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.

ఆ ఫిర్యాదు సంగతేమిటో..?

మరోవైపు తెలంగాణ రాజ్య సమితి(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం కవిత పార్టీకి టీఆర్ఎస్ సంక్షిప్త నామంతో అనుమతి ఇవ్వరాదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఈసీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కవిత పార్టీ పేరు, నా పార్టీ పేరు రెండింటిలోనూ టీఆర్ఎస్ ఉన్నందునా ప్రజలు గందరగోళపడే అవకాశం ఉందని..ఈ పరిణామం నా పార్టీకి నష్టం చేస్తుందని..అందుకే కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ సంక్షిప్త నామంతో అనుమతి ఇవ్వరాదంటూ బాలరంగం ఫిర్యాదు చేశారు.

 

ఇవి కూడా చదవండి :

అభినవ షాజహాన్..భార్యకు తాజమహల్ భవనం!
Transgenders | ట్రాన్స్‌జెండర్లు శుభకార్యాలకు వచ్చి డబ్బులు అడిగే హక్కు లేదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Latest News