నేను చేసింది తప్పే : ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి

సహచర ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఈశ్వర్ సాయి తను చేసింది తప్పేనంటూ ఓ సెల్పీ వీడియో విడుదల చేశారు. భార్య ఉండగా నేను మరో అమ్మాయితో కలవడం కరెక్ట్ కాదు అని.. నేను చేసింది తప్పేనని అంగీకరించారు. ఒత్తిడి కారణాల దృష్ట్యా హోటల్‌లో అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు.

విధాత, హైదరాబాద్ : సహచర ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఈశ్వర్ సాయి తను చేసింది తప్పేనంటూ ఓ సెల్పీ వీడియో విడుదల చేశారు. భార్య ఉండగా నేను మరో అమ్మాయితో కలవడం కరెక్ట్ కాదు అని.. నేను చేసింది తప్పేనని అంగీకరించారు. ఒత్తిడి కారణాల దృష్ట్యా హోటల్‌లో అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఈశ్వర్ సాయి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈశ్వర్ సాయి ఇటీవల వేములవాడలోని రెడ్డి భవన్ లో తన తోటి డాన్సర్ మాధురి రాథోడ్ తో గదిలో ఉండగా.. ఆయన భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం వైరల్ అయ్యింది.

ఈ ఘటన అనంతరం రెండు రోజుల క్రితం ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఒక ఇంటర్వ్యూలో తన భర్త చేసిన పనికి విడాకులు ఇస్తున్నారా? అని అడగగా.. “నేను విడాకులు ఎందుకు ఇవ్వాలి? నా భర్తను నేను వదులుకోను.. ఇరువర్గాలు కూర్చొని.. అన్ని సెటిల్ చేసుకున్నాము. ఇప్పుడు ఎలాంటి గొడవలు లేవు. అనవసరంగా మా గురించి మాట్లాడడం ఆపేయండని చెప్పుకొచ్చారు. అయితే తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ.. తనను దారుణంగా హింసించి కొట్టారు అంటూ మాధురి రాథోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం గమనార్హం.

 

Latest News