మ‌ద్యం అక్ర‌మ రవాణాపై ఎక్సైజ్ నిఘా

మ‌ద్యం అక్ర‌మ రవాణాపై ఎక్సైజ్ నిఘా

విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎక్సైజ్ శాఖ క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అక్ర‌మంగా అమ్మ‌కాలు, ర‌వాణా, నిల్వ‌ల‌ను అరిక‌ట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రంగంలోకి దిగింది. 29,663 మంది అనుమానాస్పద వ్యక్తులను ముందస్తుగానే బైండోవర్ చేసింది.


8362 మంది హిస్టరీ షీటర్ల పై నిఘా ఉంచింది. అలాగే 14 మందిపై పీడీ యాక్ట్ న‌మోదు చేసింది. ఈ మేర‌కు ఏర్పాటు చేసిన 21 అంతర్‌రాష్ట్ర చెక్ పోస్టుల వ‌ద్ద త‌నిఖీలు ముమ్మ‌రం చేసింది. చెక్‌పోస్టుల వ‌ద్ద సీసీ కెమెరాల‌ను నేరుగా క‌మాండ్‌కంట్రోల్ సెంట‌ర్‌తో అనుసంధానం చేశారు.