వీహెచ్‌కు కేటుగాళ్ల వల.. పోలీసులకు ఫిర్యాదు

వీహెచ్‌కు కేటుగాళ్ల వల.. పోలీసులకు ఫిర్యాదు

విధాత: కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కేటుగాళ్లుటోపీ పెట్టబోయిన ప్రయత్నం విఫలమైంది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పేరిట విహెచ్. హన్మంత రావును బోల్తా కొట్టించే యత్నం చేశారు. ఓ నంబర్ నుంచి ఫోన్ చేసిన కేటుగాడు తాను హరిరామ జోగయ్యగా చెప్పుకుని ఆపదలో ఉన్నాను అర్జెంటుగా డబ్బులు పంపాలని విహెచ్ ను కోరాడు.

కాగా.. ఆ ఫోన్ నంబర్ హరిరామ జోగయ్యది కాకపోవడంతో అనుమానం వచ్చిన విహెచ్‌ నేరుగా తన మనిషిని ఒకరిని జోగయ్య ఇంటికి పంపి విచారణ చేయించారు. తనకు వచ్చిన ఫోన్ కాల్ ఫేక్ అని తేలడంతో వెంటనే విహెచ్ ఈ ఘటనపై వెస్ట్ గోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఖమ్మం నుంచి ఫోన్ వచ్చినట్లుగా వెస్ట్ గోదావరి ఎస్పీ చెప్పడంతో , ఖమ్మం ఎస్పీకి, సైబరాబాద్ పోలీసులకు విహెచ్ ఫిర్యాదు చేశారు.