New Year | న్యూఇయర్ వేడుకలు.. 15 రోజుల ముందు అనుమతి తీసుకోవాల్సిందే..!
New Year | హైదరాబాద్ నగరం న్యూఇయర్ వేడుకలకు సిద్ధం అవుతుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఔత్సాహికులు ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలకు రెస్టారెంట్లు, పబ్‌లు, క్లబ్స్‌తో పాటు స్టార్ హోటల్స్ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
New Year | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం న్యూఇయర్ వేడుకలకు సిద్ధం అవుతుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఔత్సాహికులు ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలకు రెస్టారెంట్లు, పబ్‌లు, క్లబ్స్‌తో పాటు స్టార్ హోటల్స్ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే రెస్టారెంట్లు, క్లబ్స్, పబ్బులు, స్టార్ హోటళ్ల యజమానులు 15 రోజుల ముందుగానే తమకు దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు. నూతన సంవత్సర వేడుకలకు హాజరయ్యే వారికి ఇబ్బంది కలగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా రూల్స్ ప్రకారం ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.
న్యూఇయర్ వేళ నిబంధనలివే :
ఈవెంట్స్ జరిగే ప్రాంతంలో ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
గెస్ట్‌ల భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు సిబ్బంది ఉండాలి.
పార్టీల్లో అశ్లీల డ్యాన్సులు, అసభ్యత ఉండొద్దు.
బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలకు నిలిపివేయాలి.
ఇండోర్‌లో అర్ధరాత్రి 1 గంట వరకు తక్కువ శబ్ధం(45 డెసిబుల్) సౌండ్ మాత్రమే ఉపయోగించాలి.
పార్టీల్లో బాణసంచాకు అనుమతి లేదు.
వెహికల్ పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలి.
పబ్‌లు, బార్లలో మైనర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు.
మత్తుపదార్థాలు(డ్రగ్స్) విక్రయించినా, వాడినా కేసులు తప్పవు.
ప్రాంతం కెపాసిటీకి మించి పాస్‌లు/టికెట్లు/కూపన్లు ఇవ్వొద్దు.
బార్లు, పబ్‌ల నిర్వాహకులు కస్టమర్స్‌ను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు క్యాబ్స్, డ్రైవర్లను ఏర్పాటు చేయాలి.
మద్యం సేవించి వెహికల్ నడుపుతూ పట్టుబడితే కేసు నమోదు చేస్తారు.
పట్టుబడిన వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారు.
న్యాయస్థానం రూ.10వేల వరకు జరిమానా, 6 నెలల జైలుశిక్షను విధించొచ్చు.
నిబంధనలు ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా పూర్తిగా సస్పెండ్ చేసే అవకాశం.
మైనర్లు బండి నడుపుతూ పట్టుబడినా, ప్రమాదానికి గురైనా ఓనర్‌దే బాధ్యత.
బైక్‌లకు సైలెన్సర్ తొలగించి శబ్ధకాలుష్యానికి కారకులు కావొద్దు.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా షీటీమ్స్ నిఘా ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram