Madhu Yaskhi | అమెరికాలో కారు ప్రమాదం.. మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచికి తీవ్ర గాయాలు

Madhu Yaskhi | అమెరికాలో ఘోర కారు ప్రమాదం జరిగింది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి ఎండోక్రినాలజిస్ట్, సీనియర్ డాక్టర్ సుచి యాష్కీకి కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.

Madhu Yaskhi | అమెరికాలో ఘోర కారు ప్రమాదం జరిగింది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి ఎండోక్రినాలజిస్ట్, సీనియర్ డాక్టర్ సుచి యాష్కీకి కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కీని బోస్టెన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ హాస్పిటల్‌లో ఎండీ కోర్సులో చేర్పించి, తిరుగు ప్రయాణంలో న్యూయార్క్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

వర్షం కారణంగా సుచి యాష్కీ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో డాక్టర్ సుచి యాస్కీకి రిబ్స్ విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రస్తుతం మధుయాష్కీ గౌడ్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. ఇటీవల డాక్టర్ గగన యాష్కీ న్యూయార్క్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా.. కాన్వకేషన్‌కు హాజరయ్యేందుకు ఆయన అమెరికా వెళ్లారు. కాన్వకేషన్ అనంతరం ఎండీ కోర్సులో జాయిన్ చేశారు. ఈ క్రమంలో లగేజ్ ఎక్కువగా ఉండటంతో సుచి, మధుయాష్కీ ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

Latest News