Site icon vidhaatha

Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం,మూడో ప్రమాద హెచ్చరిక జారీ … పలు కాలనీల్లో చేరిన వరద నీరు

విధాత:భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంతో పాటుగా పైనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు నీటిమట్టం 53.2 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు గోదావరి నీటిమట్టం 52.4 అడుగుల వద్ద ప్రవహించిన వరదనీరు క్రమంగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.2 అడుగులకు చేరడంతో అధికారులు చివరి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పట్టణంలోని ఏఎంసీ కాలనీలోని మురుగునీరు గోదావరిలో కలవడానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కాలనీలోకి మురుగు నీరు చేరడంతో సుమారు 80 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Exit mobile version