Site icon vidhaatha

ACB Raids | ఏసీబీకి చిక్కిన హవేలీ ఘనపూర్ ఎస్‌ఐ

ఏజెంట్ మస్తాన్ ద్వారా 20 వేలు వసూలు
ఎస్ఐపై కేసు నమోదు
ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడి

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సీజ్‌ అయిన టిప్పర్‌ రిలీజ్‌ కోసం డబ్బులు డిమాండ్‌ చేసిన మెదక్‌ జిల్లా హవేలీ ఘనపూర్‌ ఎస్‌ఐ అనంద్ గౌడ్.. ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు. బాధితుడు పూల గంగాధర్‌ ఇచ్చిన సమాచారంతో సిద్ధమైన ఏసీబీ అధికారులు.. పోలీస్ స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఎస్ఐ ఏజెంట్ మస్తాన్ ద్వారా 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. గత నెల 26 న స్పెషల్ పార్టీ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ సీజ్ చేసి హవేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ టిప్పర్ రిలీజ్ కోసం 30వేలు లంచం ఇవ్వాలని ఎస్‌ఐ ఆనంద్ గౌడ్ యజమాని పూల గంగాధర్ ను డిమాండ్ చేశాడు. 20 వేలకు ఒప్పందం కుదిరింది. గత నెల 28న బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

ఒప్పందం ప్రకారం 20 వేలు ఒక ప్రైవేటు వ్యక్తి మస్తాన్ ద్వారా సోమవారం బాధితుడు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ప్రైవేట్ వ్యక్తి మస్తాన్ తో పాటు ఎస్ఐని ఏసీబీ అధికారులు అదుపు లోకి తీసుకొన్నారు. 20 వేలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.

 

Exit mobile version