Site icon vidhaatha

Heavy Rains | రేప‌ట్నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు..!

Heavy Rains | హైద‌రాబాద్ : తెలంగాణ‌( Telangana )లో మ‌ళ్లీ వ‌ర్షాలు( Rains ) మొద‌ల‌య్యాయి. నిన్న‌, మొన్న రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు దంచికొట్టాయి. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రాన్ని కూడా వాన‌లు ముంచెత్తాయి. బంగాళాఖాతం( Bay of Bengal )లో ఏర్ప‌డే అల్ప‌పీడ‌నం( Low Pressure ) ప్ర‌భావం వ‌ల్ల ఈ నెల 23 నుంచి 26వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం( IMD Hyderabad ) హెచ్చ‌రించింది.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మహ‌బూబాబాద్‌, వరంగల్‌, హనుమ‌కొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల భారీ వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

కాగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని సూచించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. సూర్యాపేట, వరంగల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వివరించింది. ఆదివారం నారాయణపేట, గద్వాల్‌ జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల దృష్యా ఎవరూ బయటకు రావొద్దని, అత్యవసర పరిస్థితుల్లోనే రావాలని సూచించింది.

Exit mobile version