హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సీపీ సీవీ ఆనంద్ డ్రగ్ రాకెట్ వివరాలను వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నైజిరియన్లతో పాటు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొకైన్ సరఫరా చేస్తున్న ఆరుగురు, మెఫిడ్రీన్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితల నుంచి 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎక్స్‌టసీ, ఒక తుపాకీ, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. డ్రగ్స్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న మరో ఇద్దరు విదేశీయుల పాస్ పోర్టును డిపోర్టరేషన్ చేయనున్నట్లుగా తెలిపారు. డగ్స్ కేసులో రవివర్మ, సచిన్ అనే ఇద్దరు కీలక వ్యక్తులను పట్టుకుని వారి నుంచి రాబట్టిన కీలక సమాచారంతో రవివర్మకు ముంబయికి చెందిన ముఠాతో సంబంధాలున్నాయని గుర్తించామని వెల్లడించారు.
అక్కడ ఉన్న వాహిద్ అనే వ్యక్తికి విదేశాల నుంచి కొకైన్ వస్తోందని.. అతడి నుంచి నిందితులు హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొస్తున్నారని తెలిపారు. ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే వినియోగదారుడిని అరెస్ట్ చేయడంతో ఈ ముఠా గుట్టురట్టయింది. నిందితుల నుంచి రూ.69లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం. కాటేదాన్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన పవన్ భాటీని కూడా అరెస్ట్ చేశాం. హేమ్‌సింగ్ అనే మరో వ్యక్తితో కలిసి పవన్ భాటీ డ్రగ్స్ విక్రయిస్తున్నాడని తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు.