వేయి రూపాయల బిర్యానీ.. లక్ష రూపాయల ఆసుపత్రి బిల్లు
వేయి రూపాయల బిర్యానీ తిని.. లక్ష రూపాయల ఆసుపత్రి బిల్లు కట్టాడో బాధితుడు. షాద్‌నగర్ నందిగామ మండలం అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజున

విధాత, హైదరాబాద్: వేయి రూపాయల బిర్యానీ తిని.. లక్ష రూపాయల ఆసుపత్రి బిల్లు కట్టాడో బాధితుడు. షాద్‌నగర్ నందిగామ మండలం అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజున ఈనెల 22న షాద్‌నగర్‌లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. ఇంటికి చేరుకున్నాక ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి.
దీంతో శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. నరేందర్‌కు రక్తపు వాంతులు, విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల హైదరాబాద్ పరిధిలో టాస్క్‌ఫోర్సు అధికారులు రెస్టారెంట్లు, హోటళ్లపై వరుస దాడులు నిర్వహించిన సందర్భంలో వాటిలో నాణ్యతలేని, కాలం చెల్లిన అపరిశుభ్రమైన నాసిరకం ఆహార పదార్ధాలను, తయారీ సామాగ్రీని పట్టుకున్న ఘటన అందరికి తెలిసిందే. అటువంటి వాటిలో ఆహారం తింటే నరేందర్ పరిస్థితి తప్పదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.