రెండు నెలల్లో డ్రగ్ రహిత సిటీగా హైద్రాబాద్
రెండు నెలల్లో హైద్రాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చే లక్ష్యంతో పోలీస్ శాఖలోని వివిధ విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు

- సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
విధాత : రెండు నెలల్లో హైద్రాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చే లక్ష్యంతో పోలీస్ శాఖలోని వివిధ విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఆదివారం నగర పోలీస్ శాఖలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైద్రాబాద్‌లో రెండు నెలల్లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మించాలని, సిటీలో డ్రగ్స్ ,గంజాయి మాట వినపడద్దన్నారు. నిజమైన బాధితుడికి మాత్రమే పెండ్లి పోలీస్ వర్తిస్తుందని,
పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగంలలో ఎంతటి వారున్న వదిలేది లేదన్నారు. పబ్‌లు, క్లబ్బులలో, సినీ ఇండస్ట్రీ ఎక్కడైనా సరే డ్రగ్స్ మాట వినబడరాదన్నారు. గంజాయి, డ్రగ్స్ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైనా ఇక మీదట వాటికి దూరంగా ఉండాలని లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు.