Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు మళ్లీ బదిలీ అయ్యారు. తాజాగా పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురిని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లుగా నియామకం అయ్యారు.
సీఎంవోలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న జయేశ్ రంజన్, అదే విభాగంలో అడిషనల్ సీఈఓగా పనిచేస్తున్న వెంకట్ నర్సింహా రెడ్డిలను బదిలీ చేసింది ప్రభుత్వం. ఐఏఎస్ జయేశ్ రంజన్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ.. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పర్యాటక శాఖ ప్రత్యేక సీఎస్‌గానూ ఆయన కొనసాగనున్నారు. సిరిసిల్ల కలెక్టర్‌గా ఉన్న హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సిరిసిల్ల కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ కొనసాగనున్నారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఈవీ నర్సింహారెడ్డిని ప్రభుత్వం నియమించింది.
జీహెచ్ఎంసీలో పలు జోన్లకు కొత్త కమిషనర్లు
కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా అపూర్వ చౌహాన్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా హేమంత్ సహదేవ్‌రావ్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా సందీప్ సుల్తానియా, గొల్కొండ జోనల్ కమిషనర్‌గా జీ ముకుంద్ రెడ్డి, చార్మినార్ జోనల్ కమిషనర్‌గా ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా ప్రియాంక, రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్‌గా సంచిత్ గంగ్వార్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా ఎన్ రవి కిరణ్, శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా కే చంద్రకళ, ఉప్పల్ జోనల్ కమిషనర్‌గా రాధికా గుప్తాను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
