iBomma| ఐబొమ్మ వైబ్ సైట్ల క్లోజ్..నిందితుడు రవి సవాల్ ను ఫినిష్ చేసిన సైబర్ క్రైమ్!

సినిమాల పైరసీలతో నిర్మాతలకు కోట్ల రూపాయాల్లో నష్టం చేస్తున్న ఐబొమ్మ, బప్పం టీవీ వైబ్ సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు. వెబ్‌ లాగిన్స్‌, సర్వర్‌ వివరాలతో మూసివేశారు. నిందితుడు ఇమ్మడి రవితోనే ఆ వెబ్ సైట్లను క్లోజ్ చేయించి..దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ అతను విసిరిన సవాల్ ను విజయవంతంగా ఫినిష్ చేశారు.

విధాత, హైదరాబాద్ : సినిమాల పైరసీ(Movie Piracy)లతో నిర్మాతలకు కోట్ల రూపాయాల్లో నష్టం చేస్తున్న ఐబొమ్మ(iBomma), బప్పం టీవీ(BappamTV)వైబ్ సైట్ల(Piracy Websites Shutdown)ను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు. వెబ్‌ లాగిన్స్‌, సర్వర్‌ వివరాలతో మూసివేశారు. నిందితుడు ఇమ్మడి రవితోనే ఆ వెబ్ సైట్లను క్లోజ్ చేయించి..దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ అతను విసిరిన సవాల్ ను విజయవంతంగా ఫినిష్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్‌ డిస్క్‌లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిందితుడి బ్యాంక్‌ ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నారు. ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించాలని కోర్టులో 7రోజుల కస్టడి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇమ్మడి రవికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 5 సంవత్సరాల క్రితమే భార్యతో విడాకులు తీసుకున్న రవిని అరెస్టు చేసిన సమయంలో అతని నుంచి పైరసీ సామాగ్రీతో పాటు బ్యాంకు ఖాతాలో 2.5 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.

పైరసీ వెబ్ సైట్ల నిర్వాహకులను పట్టుకునే క్రమంలో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఒక్కడే తప్పించుకున్నాడు. ఆ సందర్భంగా అతను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు దమ్ముంటే నన్ను పట్టుకోండంటూ సవాల్ విసిరాడు. నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్‌సైట్‌ మీద ఫోకస్‌ చేయటం ఆపండి లేదంటే మీకే నష్టం అంటూ హెచ్చరించాడు. పోలీసులకు సవాల్ ఇమ్మడి రవి సవాల్ విసరడంతో అప్పటి నుంచి అతని ఆచూకీకై నిఘా పెట్టి రెండు రోజుల క్రితం అరెస్టు చేసి..అతనితో ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్లను క్లోజ్‌ చేయించడం విశేషం.