బాల్క సుమన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

- కలెక్టరేట్ ఎదుట జర్నలిస్ట్ ల నిరసన
- అనుచిత వ్యాఖ్యలపై కలెక్టర్, డీసీపీకి ఫిర్యాదు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని టీయూడబ్ల్యుజే (ఐజేయూ) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో నిరసన చేపట్టారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ సభవత్ మోతీలాల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డేగ సత్యం మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు నేరుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం గా వ్యహరిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రేపు దిష్టిబొమ్మ దహనం చేస్తామని తెలిపారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ సుమన్ ప్రవర్తన శైలి మార్చుకోవాలని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేష్, సాగే సుమోహన్, బొడ్డు శంకర్, శంకర్ సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పింగిళి సంపత్ రెడ్డి, కోశాధికారి వంశీ కృష్ణ, ఐజేయూ కౌన్సిల్ మెంబర్ కాచం సతీష్, ఉపాధ్యక్షులు చౌదరి సురేష్, మద్దెల సంజీవ్, పడాల సంతోష్, కొండా శ్రీనివాస్, రవిరాజ, కార్యనిర్వాహక కార్యదర్శి కల్వల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఏ రాజేష్, ఎస్ రాజేశ్వర్, జర్నలిస్టులు ఎర్రం ప్రభాకర్, పురేళ్ల రాజన్న, ఆవుల శ్రీధర్, అడేపు సత్యనారాయణ, నెరేళ్ళ రమేష్, రాజు కుమార్, సీహెచ్ జనార్ధన్, కడారి శ్రీధర్, సలాం, కే శ్రీనివాస్, డీ రాజన్న, ఎస్ వీరస్వామి పాల్గొన్నారు.