మద్యంమత్తులో సీఐ కొడుకు వీరంగం.. అడ్డువచ్చిన వారిపై దౌర్జన్యం

పబ్లిక్ ప్లేస్ లో మూత్రం పోయవద్దని చెప్పినందుకు మిత్రులతో కలిసి క్యాబ్ డ్రైవర్ పై ఓ సీఐ కొడుకు, ఆయన స్నేహితులు కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన కాజీపేట బస్టాండ్ వద్ద జరిగింది.

మద్యంమత్తులో సీఐ కొడుకు వీరంగం.. అడ్డువచ్చిన వారిపై దౌర్జన్యం

విధాత, వరంగల్ ప్రతినిధి:పబ్లిక్ ప్లేస్ లో మూత్రం పోయవద్దని చెప్పినందుకు మిత్రులతో కలిసి క్యాబ్ డ్రైవర్ పై ఓ సీఐ కొడుకు, ఆయన స్నేహితులు కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన కాజీపేట బస్టాండ్ వద్ద జరిగింది.

దెబ్బలకు తట్టుకోలేక పక్కనే ఉన్న బస్టాండ్ లోకి డ్రైవర్ పరిగెత్తినా విడిచిపెట్టకుండా వెంటపడి మరీ సీఐ కొడుకు అతడి మిత్రులు దాడి చేశారు. అడ్డు వచ్చిన వారిని జేబులోని పాకెట్ నైఫ్ లతో బెదిరించినట్లు చెబుతున్నారు. చేతికి ఉన్న కడియంతో తలపై గుద్దడంతో డ్రైవర్ తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. గాయపడిన వ్యక్తిని 108లో తోటి డ్రైవర్లు ఆసుపత్రికి తరలించారు.

పొలీసులతో వాగ్వాదం

పక్కన నిలిపి ఉంచిన 3 కార్ల పై గుద్దడంతో అద్దాలకు పగుళ్లు వచ్చాయి. స్టేషన్ కి తరలించిన పోలీసులతోనూ వాగ్వాదం దిగినట్లు సమాచారం. నా తండ్రి సిద్దిపేటలో సీఐ నన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ డ్రైవర్ లను బూతులు తిట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. సీఐ కొడుకుతో పాటు దాడిలో మరో 6 గురు యువకులు ఒక యువతి ఉన్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 4గంటలకు కాజీపేట చౌరస్తాలోని హైదరాబాద్ బస్టాండ్ వద్ద జరిగిన ఘటన ఘటనపై కాజీపేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు.