Kavitha Arrest: కవిత రైల్ రోకో.. అరెస్టు..ఉద్రిక్తత

కవిత నేతృత్వంలో కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకో ఉద్రిక్తతకు దారితీసింది. బీసీ రిజర్వేషన్లపై నిరసన తెలిపిన కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Nov 28, 2025, 4:09 pm IST
Read Time: 3 mins
Kavitha Arrest: కవిత రైల్ రోకో.. అరెస్టు..ఉద్రిక్తత

విధాత : కామారెడ్డిలో జనం బాట కార్యక్రమంలో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కవిత జాగృతి కార్యక్తర్తలతో కలిసి రైలు రోకో నిర్వహించారు. రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. కవిత రైల్ రోకో నిరసన సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తోపులాట క్రమంలో కవిత చేతికి స్వల్ప గాయమైంది.

ఈ సందర్బంగా కవిత, తెలంగాణ జాగృతి నాయకులతో పోలీసులకు మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. అరెస్టు అనంతరం కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తామని హామీ ఇచ్చి..ఇప్పుడు కేవలం 17 శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకుంటూ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి :

Pawan Kalyan : పవన్ కల్యాణ్ పర్యటనలో అపరిచితుడి కలకలం!
Ditva Cyclone| ఏపీకి హెచ్చరిక.. దూసుకొస్తున్న ‘దిత్వా’ తుపాన్