Ditva Cyclone| ఏపీకి హెచ్చరిక.. దూసుకొస్తున్న ‘దిత్వా’ తుపాన్

‘దిత్వా’ తుపాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఏపీకి వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ ఆదివారానికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరం సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని..దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా, రాయలసీమలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Nov 28, 2025, 11:55 am IST
Read Time: 2 mins
Ditva Cyclone| ఏపీకి హెచ్చరిక.. దూసుకొస్తున్న ‘దిత్వా’ తుపాన్

అమరావతి : ‘దిత్వా’ తుపాన్ (Ditva Cyclone) దూసుకొస్తున్న నేపథ్యంలో ఏపీ(AP Weather Alert)కి వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ‘దిత్వా’ తుపాను నెమ్మదిగా కదులుతోందని ఏపీ విపత్తుల ప్రతిస్పందన సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)కి 80కి.మీ, పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉందని.. గడిచిన 6 గంటల్లో 8 కి.మీ వేగంతో కదిలిందని తెలిపారు. ఆదివారానికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరం సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని..దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా, రాయలసీమలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ‘దిత్వా’ తుపాన్ ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.