Ditva Cyclone| ఏపీకి ‘దిత్వా’ తుపాన్ ముప్పు!

నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో 'దిత్వా' తుపాన్ వేగంగా కదులుతుంది. ప్రస్తుతం కారైకాల్ కి 220 కిలోమీటర్లు..పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు, చెన్నైకి 430కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాన్ గడిచిన 6 గంటల్లో 7కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. ఏపీకి వాతావరణ శాఖ తుపాన్ హెచ్చరికలు జారీ చేసింది.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Nov 29, 2025, 10:37 am IST
Read Time: 3 mins
Ditva Cyclone| ఏపీకి ‘దిత్వా’ తుపాన్ ముప్పు!

అమరావతి : నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాన్Ditva Cyclone వేగంగా కదులుతుంది. ప్రస్తుతం కారైకాల్ కి 220 కిలోమీటర్లు..పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు, చెన్నైకి 430కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాన్ గడిచిన 6 గంటల్లో 7కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. రేపు తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీ(AP) విపత్తుల నిర్వహణ సంస్థ(Disaster Management) ఎండీ ప్రఖర్ జైన్(Prakhar Jain) తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

బాపట్ల,పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు అని, ప్రజలు, రైతులు తుపాన్ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.