KTR : బరాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటా

మా అయ్య మొగోడు.. మొనగాడు, బరాబర్ ఆయన పేరు చెప్పుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని 'భీమవరం బుల్లోడు' అని సంబోధిస్తూ ఘాటు విమర్శలు చేశారు.

KTR

విధాత, హైదరాబాద్ : మా అయ్య గొప్పోడు..మొగోడు..మొనగాడు, తెలంగాణ తెచ్చినోడు అని..బరాబర్ నేను మా అయ్య చెప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు కానీ నువ్వు లుచ్చా పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పడని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు విసిరారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, అల్విన్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై స్పందించారు.

కేసీఆర్ నా తండ్రి.. ఆయన్ని అనరాని మాటలు అన్నందుకు రేవంత్ రెడ్డిపై నాకు గొంతు వరకు కోపం ఉందని.. రేవంత్ రెడ్డి కనిపిస్తే ఎడమ కాలి చెప్పు తీసుకొని తన్నాలి అనిపిస్తుంది.. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు.. రెండు సార్లు సీఎంగా పనిచేశారన్న గౌరవం కూడా లేకుండా కేసీఆర్ ను రేవంత్ తిట్టడం ఓ కొడుకుగా నాకు బాధగా ఉందన్నారు. మాకు రాదా తిట్టడం మాకు వచ్చు అని..హైదరాబాద్ లో పెరిగినోడిని..నువ్వు ఊరికెళ్లి వచ్చావని..నీ సీఎం కుర్చీకి విలువ ఇచ్చి ఆగుతున్నాం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హామీలపైన, కృష్ణా నది జలాలపై జరుగుతున్న అన్యాయంపైన కేసీఆర్ ప్రశ్నిస్తే..నీ అమ్మ..అయ్యా..లాగుల తొండలు ఇడుస్తా అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని.. వీడేం ముఖ్యమంత్రి, వీడిదేం భాష? తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీలో పొల్లు పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉందని కేటీఆర్ అన్నారు. గీతమ్మా.. మీ భర్త రేవంత్ రెడ్డిని తొందరగా కట్టేయ్… లేదంటే అరిచి, అరిచి మందిని కరిచేలా ఉన్నాడని కేటీఆర్ ఎద్దెవా చేశారు. అమెరికాలో ఎవరు ఇండ్లలో వాళ్లే అన్ని పనులు చేసుకుంటారని..అట్లనే నేను నా బాత్ రూమ్ కడుక్కున్నానని..నీ లెక్క సంచులు మోయలే..దొంగ పనులు చేసి దొరికిపోలేదన్నారు.

నేను గుంటూరులో చదువుకుంటే తప్పు అటగాని..ఆయన ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు లేదట అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకున్నాడు కాబట్టి ఇక నుంచి రేవంత్ రెడ్డి పేరును చిట్టినాయుడుకు బదులుగా భీమవరం బుల్లోడు అని పెడదాం అన్నారు. నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొప్పిరా నాయన..నేను ప్రపంచమంతా చదువుకున్నా, నీ లెక్క సదువు సంధ్య లేకుండా తిరగలేదు అని విమర్శించారు. మీ అమ్మ నాయన నీకు సక్కగ తోవ చూపియ్యకపోతే నా తప్పా? అంటూ మండిపడ్డారు. దొంగ పనులు చేసి, ఢిల్లీకి మూటలు మోసి..నెలనెల సూట్ కేసులు మోస్తూ సీఎంగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి చరిత్ర అందరికి తెలుసన్నారు.

రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో కూల్చివేతలు..పేల్చివేతలు..ఎగవేతలు తప్ప ఈ రెండేండ్లలో
కాంగ్రెస్ చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్..మళ్లా రాకుండా చేస్తా అంటూ శపథాలు చేస్తున్నాడని..నిన్ను కొడంగల్‌లో ఓడగొట్టి అసెంబ్లీకి రాకుండా చేసే బాధ్యత మాది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నీకు దమ్ముంటే జనవరి నుంచి కోటి మంది నెలకు రూ. 2,500, వృద్దులకు 4వేల పెన్షన్, , ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని శపథాలు చేయి అని కేటీఆర్ హితవు పలికారు. నిజాయితీతో పనిచేసే అధికారులను అప్రాధాన్యత పోస్టుల్లో పడేస్తున్నారన్నారు. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే గాంధీ సహా ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10మందికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని కేటీఆర్ సవాల్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Wild Boar Attack : ఫారెస్టు ఆఫీసర్ పై అడవి పంది దాడి..వీడియో వైరల్
Anasuya | అన‌సూయ త‌గ్గేలా లేదుగా.. ట్రోల‌ర్స్‌కి కౌంట‌ర్‌గా స్విమ్ షూట్ వీడియో షేర్ చేసిన యాంక‌రమ్మ‌

Latest News