విధాత:మెదక్ ప్రత్యేక ప్రతినిధి: భారతీయ పాలన, ప్రజా విధానం అనే అంశంపై బంగ్లాదేశ్కు చెందిన డిప్యూటీ కమిషనర్లు, జిల్లాల కలెక్టర్లకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఢిల్లీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వంలోని పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ సుపరిపాలనపై చేపట్టిన చర్యల గురించి పూర్తిస్థాయిలో వివరించారు. గతంలో ఆసిఫాబాద్ కలెక్టర్‌గా తాను పని చేసిన సమయంలో ఇన్నోవేటర్ ప్రోగ్రాంలో భాగంగా వాటి గుర్తింపుగా వచ్చిన ప్రధానమంత్రి అవార్డుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో సుపరిపాలనపై చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను పవర్ పాయింట్ ద్వారా అందరికీ వివరించారు. విదేశీ అధికారులకు సుపరిపాలనపై అవగాహన కల్పించిన రాహుల్ రాజ్‌ను పలువురు ఉన్నతాధికారులు, బంగ్లాదేశ్ అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా రాహుల్ రాజ్‌ను అభినందిస్తూ మెమొంటో అందించారు. గతంలో దేశంలోనే ఉత్తమ కలెక్టర్‌గా ప్రధాన మంత్రి అవార్డును రాహుల్ రాజ్ అందుకున్న విషయం తెలిసిందే.
Rahul Raj | బంగ్లాదేశ్ డిప్యూటీ కమిషనర్లు, జిల్లా కలెక్లర్లకు శిక్షణనిచ్చిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
భారతీయ పాలన, ప్రజా విధానం అనే అంశంపై బంగ్లాదేశ్కు చెందిన డిప్యూటీ కమిషనర్లు, జిల్లాల కలెక్టర్లకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఢిల్లీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Latest News
చీరలో వరంగల్ భామ వయ్యలు.. ఈషా రెబ్బను ఇలా చూసి తట్టుకోవడం కష్టమే!
న్యూజీలాండ్తో తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
సంయుక్త మీనన్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసుండరు భయ్యా.. ఇంకెందుకు లేటు ఒక లుక్ వేసేయండి!
తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా సమ్మక్క సారలమ్మ జాతర : భట్టి విక్రమార్క
డిజిటల్ అరెస్టు పేరిట వృద్ధ దంపతుల రూ.15 కోట్లు హాంఫట్!
క్యూబాకు ట్రంప్ బెదిరింపు.. సమయం మించిపోక ముందే డీల్ కుదుర్చుకోవాలని వార్నింగ్!
నెట్టింట మరో ‘మోనాలిసా’.. వీడియో వైరల్
చిరంజీవి.. ‘మన శంకర వరప్రసాద్’కు ఊరట
అతిపెద్ద అనాకొండా.. అమెజాన్ అడవుల్లో కనిపించిన అనా జూలియా!! పొడవు తెలిస్తే షాకే!
తొలి రోజుల్లో ఎదురైన కష్టాలు చెప్పిన హీరోయిన్ ..