మెదక్ అల్లర్ల లో నిర్లక్ష్యం వహించిన మెదక్ టౌన్…మెదక్ రూరల్ సీ ఐ లను సస్పెండ్ చేసిన ఐజి రంగనాథ్

బక్రీద్ పండుగ కు 2 రోజుల ముందు మెదక్ పట్టణంలో రెండు వర్గాలు రాళ్ళు రువ్వుకొని,కత్తి పొట్ల గురై అల్లరులు చెలరేగిన సంఘటనలో మెదక్ టౌన్,రూరల్ సీఐ లు దీలిప్,కేశవ్ లను సస్పెండ్ చేశారు

  • Publish Date - June 22, 2024 / 11:12 PM IST

విధాత:మెదక్ ప్రత్యేక ప్రతినిధి : బక్రీద్ పండుగ కు 2 రోజుల ముందు మెదక్ పట్టణంలో రెండు వర్గాలు రాళ్ళు రువ్వుకొని,కత్తి పొట్ల గురై అల్లరులు చెలరేగిన సంఘటనలో మెదక్ టౌన్,రూరల్ సీఐ లు దీలిప్,కేశవ్ లను సస్పెండ్ చేశారు.ఈ మేరకు ఐజి రంగనాథ్ మెదక్ లో 2 రోజులపాటు ఉండి విచారణ చేసిన విషయం తెలిసిందే.అల్లర్ల ను అదుపు చేయడంలో పోలీస్ లు విఫలమయ్యారు.దీంతో 2 వర్గాలు రోడ్లపై కి వచ్చి రచ్చ చేసిన విషయం తెల్సిందే.ఇరు వర్గాల కు చెందిన పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.ఐతే పోలీస్ లు గొరక్షణ సమితి సభ్యులు ఉదయం ఇచ్చిన ఫిర్యాదుపై సరిగా స్పందించక పోవడంతోనే 2 వర్గాల గొడవలకు కారణమైందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించిన విషయం తెల్సిందే.

Latest News