Metro 2nd Phase | మెట్రో రెండో దశ పనులకు రంగం సిద్ధం.. హయత్‌నగర్ వరకు కారిడార్-1 పొడిగింపు
Metro 2nd Phase | హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు రెండో దశకు రంగం సిద్ధమవుతోంది. రెండో దశలో భాగంగా ముందుగా కారిడార్-1 ను ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు పొడిగించనున్నారు.

Metro 2nd Phase : హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు రెండో దశకు రంగం సిద్ధమవుతోంది. రెండో దశలో భాగంగా ముందుగా కారిడార్-1 ను ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు పొడిగించనున్నారు. ఈ ప్రతిపాదిత ఎల్బీనగర్-హయత్‌నగర్ మార్గంలో ఏడు కిలోమీటర్ల పరిధిలో 6 స్టేషన్లు రాబోతున్నాయి.
సగటున కిలోమీటరుకు కాస్త అటు ఇటుగా ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. రహదారికి ఎటువైపున ఉన్నవాళ్లైనా మెట్రో స్టేషన్‌కు సులువుగా చేరుకునేందుకు వీలుగా స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు డీపీఆర్ రూపకల్పనకు జాతీయ రహదారుల సంస్థతో కలిసి మెట్రోరైలు అధికారులు తుదిరూపు ఇచ్చారు. మెట్రో రైలు రెండో దశలో వేర్వేరు మార్గాల్లో 70 కిలోమీటర్ల నిర్మాణాన్ని ప్రతిపాదించగా.. డీపీఆర్ పనులు జరుగుతున్నాయి.
అందులో ఎల్బీనగర్-హయత్‌నగర్ మార్గం ఒకటి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకుగల కారిడార్-1కి పొడిగింపు ఇది. ఈ మార్గంలో చింతల్‌కుంట దగ్గర ఒక స్టేషన్ రానుంది. మిగతా 5 స్టేషన్లు ఎక్కడెక్కడ అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. చింతల్‌కుంట నుంచి హయత్‌నగర్ మధ్య ఫ్లైఓవర్ల నిర్మాణం నేపథ్యంలో ఎడమవైపు సర్వీస్ రోడ్డులో మెట్రోరైలు మార్గం రానుందని మెట్రో అధికారులు తెలిపారు.