Akbaruddin Owaisi | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేసే ద‌మ్ము లేదా..? కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన అక్బ‌రుద్దీన్ ఒవైసీ

Akbaruddin Owaisi | శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళ‌న‌ల‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. స‌భ‌ను ఆర్డ‌ర్‌లో పెట్టాలంటూ ఓవైసీ స్పీక‌ర్‌ను కోరారు.

Akbaruddin Owaisi | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేసే ద‌మ్ము లేదా..? కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన అక్బ‌రుద్దీన్ ఒవైసీ

Akbaruddin Owaisi | హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళ‌న‌ల‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. స‌భ‌ను ఆర్డ‌ర్‌లో పెట్టాలంటూ ఓవైసీ స్పీక‌ర్‌ను కోరారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ బిల్లుపై ఎమ్మెల్యే పాల్వాయి హ‌రీశ్ బాబు మాట్లాడుతుండ‌గా ఓవైసీ బీఆర్ఎస్ స‌భ్యుల ఆందోళ‌న‌ల‌పై జోక్యం చేసుకున్నారు.

సబితా ఇంద్ర రెడ్డి పేరు తీసుకువచ్చారు కాబట్టి.. క్లారిఫై చేసుకోవాల్సిన హక్కు ఆమెకు ఉంది. ఆమెకు మైక్ ఇవ్వలేదు సరే.. కనీసం సభను క్రమశిక్షణలో పెట్టండి, లేదా వాళ్ల‌ను స‌స్పెండ్ చేయండి. గంటన్నర నుండి బీఆర్ఎస్ వాళ్లు కొట్లాడుతున్నారు.. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్లకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి.. లేదా మైక్ ఇవ్వము అనుకుంటే వాళ్లని సస్పెండ్ చేసి సభని క్రమశిక్షణలో పెట్టండి. మీకు దమ్ము ఉంటే వాళ్లకి మైక్ ఇచ్చి మాట్లాడించండి.. లేదా సస్పెండ్ చేయండి అని అక్బ‌రుద్దీన్ ఓవైసీ స్పీక‌ర్‌ను కోరారు.

ఇక ఓవైసీ వ్యాఖ్య‌ల‌పై శాస‌న‌స‌భా వ్య‌వ‌హ‌రాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను సస్పెండ్ చేసే ద‌మ్ము లేదా అని ఓవైసీ చేసిన వ్యాఖ్య‌ల‌ను శ్రీధ‌ర్ బాబు ఖండించారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా బీఆర్ఎస్ స‌భ్యులు స‌భ‌లో ఉండాల‌నేది మా నిర్ణ‌యం. బీఆర్ఎస్ స‌భ్యుల‌కు మాట్లాడేందుకు అవ‌కాశం ఇచ్చేందుకు రెడీగా ఉన్నామ‌ని, కావాల‌ని వారే రాజ‌కీయం చేస్తున్నార‌ని శ్రీధ‌ర్ బాబు పేర్కొన్నారు. బీఆర్ఎస్‌లో సీనియ‌ర్ స‌భ్యులు ఉన్నారు.. వారికి స‌భా మ‌ర్యాద‌లు ఏంటో తెలుసని శ్రీధ‌ర్ బాబు పేర్కొన్నారు.