Sitakka | జిల్లాల్లో పరిశ్రమలు…పల్లెల్లో ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు మంత్రి సీతక్క
వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ములుగులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు
విధాత, హైదరాబాద్ : వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ములుగులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. గాంధీ నగర్ క్రాస్ మైలారం గుట్టపై ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అభివృద్ధి అంతా పట్టణాలకు కేంద్రీకృతమవ్వడవం.. పట్టణీకరణతో వలసలు పెరిగాయన్నారు. గ్రామాల్లో ఊపాది లేకపోవడంతో పట్టణాలకు వెళుతున్నారని తెలిపారు. పల్లెల్లో ఉపాధి అవకాశం కలిపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంంటుందన్నారు. అందులో భాగంగా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ములుగులో కూడా పరిశ్రమ ఏర్పాటు చేస్తామని శుభవార్త చెప్పారు. వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల మరమ్మత్తులకోసం మరిన్ని నిధులు ఇస్తామన్నారు. రైతు రుణమాఫీతో ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిందన్నారు. అధికారం పోయిందనే అక్కస్సు తోనే కొలువుల కోసం ధర్నాలు అంటూ బీఆరెస్ డ్రామాలు వేస్తుందని విమర్శించారు. 0 ఏళ్ల అధికారంలో ఉండగా ఒక్క ఉద్యోగం ఇవ్వని వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాల కోసం అంటూ ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఇచ్చామన్నారు. డీఎస్సీ పెట్టినామని, వీటిని తట్టుకోలేక.. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆరెస్ వాళ్లు యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram