Site icon vidhaatha

సీబీఐ విచారణపై కవితకు కోర్టులో దక్కని ఊరట

  • విచారణ 10వ తేదీకి వాయిదా
  • విధాత: సీబీఐ విచారణపై స్టేటస్ కో ఇవ్వాలన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. విచారణకు సంబంధించి సీబీఐ దరఖాస్తు తమకు అందలేదని, విచారణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలని అప్పటి వరకు స్టేటస్ కో ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరారు. కవిత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించింది.

    అయితే ఆమె పిటిషన్‌పై ఈనెల 10వ తేదీన విచారణ చేస్తామని తెలిపింది. విచారణకు ఒక రోజు ముందు కవితకు సమాచారం ఇవ్వాలని, మహిళా కానిస్టేబుల్స్ సమక్షంలో విచారణ సాగించాలని కోర్టు సీబీఐకి సూచించింది. అటు లిక్కర్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు బెయిల్ మంజూరీ చేసింది.

    Exit mobile version