వెదర్ అప్డేట్…తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. గంటకు 40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Apr 03, 2026, 6:52 pm IST
Read Time: 2 mins
వెదర్ అప్డేట్…తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

విధాత : తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని, శనివారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లా్ల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

బ్రేకింగ్‌ పాయింట్‌కు చేరువగా భూమి.. 2070 తర్వాత 1240 కోట్లకు జనాభా సంఖ్య

ఎస్సీ, ఎస్టీల హామీల అమలులో కాంగ్రెస్ మొండి చెయ్యి : హరీశ్ రావు