ఆర్మూర్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీఆర్ఎస్ లో ముసలం రాజుకుంది. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలపాలని కౌన్సిలర్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును కోరారు

– ఆమోదించాలని కలెక్టర్ వద్దకు కౌన్సిలర్లు
– బీఆరెస్ లో రాజుకున్న ముసలం
విధాత ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీఆర్ఎస్ లో ముసలం రాజుకుంది. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలపాలని కౌన్సిలర్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును కోరారు. 24 మంది కౌన్సిలర్లు నిజామాబాద్ లో కలెక్టర్ ను కలిసి తీర్మానపత్రాన్ని అందజేశారు. వెంటనే ఆమోదం తెలిపి, కొత్త చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. కౌన్సిలర్ భర్త పవన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచనల మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినట్లు కౌన్సిలర్లు మీడియాకు తెలిపారు.