Petrol | తెలంగాణ‌లో పెట్రోల్ ‘ఫ్రీ’.. కండిష‌న్స్ అప్లై..!

Petrol | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇంధ‌న కొర‌త ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ కొర‌త‌తో ప‌లు పెట్రోల్ బంకులు మూత‌ప‌డుతున్నాయి. పెట్రోల్, డీజిల్ లేదంటూ ఆయా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

Petrol | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇంధ‌న కొర‌త ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ కొర‌త‌తో ప‌లు పెట్రోల్ బంకులు మూత‌ప‌డుతున్నాయి. పెట్రోల్, డీజిల్ లేదంటూ ఆయా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో వాహ‌న‌దారులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ద‌మ్మ‌పేట‌లో ఎయిర్‌టెల్ స్టోర్ వారు బంపరాఫ‌ర్ ప్ర‌క‌టించారు. పెట్రోల్ బంకుల వ‌ద్ద పెట్రోల్, డీజిల్ కోసం మినీ యుద్ధాలే న‌డుస్తుంటే.. లీట‌ర్ పెట్రోల్ ఫ్రీగా పొందండి అంటూ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు.

అదేదో ఉచిత‌మే కావొచ్చు.. కానీ కండిష‌న్స్ కూడా అప్లై చేయాలి. కండిష‌న్ ఏంటంటే.. ఇత‌ర మొబైల్ నెట్ వ‌ర్కుల నుంచి ఎయిర్‌టెల్ నెట్ వ‌ర్క్‌లోకి మారితేనే లీట‌ర్ పెట్రోల్ ఫ్రీగా అంద‌జేస్తామ‌ని ఎయిర్ టెల్ స్టోర్ వ‌ద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఎయిర్‌టెల్ ఆఫ‌ర్‌కు ఆక‌ర్షితులైన కొంత‌మంది వినియోగ‌దారులు.. ఇత‌ర నెట్ వ‌ర్కుల నుంచి ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్‌లోకి మారారు.. లీట‌ర్ పెట్రోల్‌ను ఉచితంగా పొందారు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Latest News