MLRIT | ఎంఎల్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ధ ఉద్రిక్తత
దుండిగల్ మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల(ఎంఎల్‌ఆర్‌ఐటీ) ఏరోనాటికల్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ వద్ధ విద్యార్థుల, తల్లిదండ్రుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది

ఫీజు వెనక్కివ్వడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
ప్రభుత్వ వైఖరినే కారణమని ఆరోపణలు
MLRIT | దుండిగల్ మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల(ఎంఎల్‌ఆర్‌ఐటీ) ఏరోనాటికల్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ వద్ధ విద్యార్థుల, తల్లిదండ్రుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు సంబంధించి కళాశాల యాజమాన్యం తమ వద్ద నుంచి లక్షల్లో ఫీజులు (Fee) తీసుకుని ఇప్పుడు సీట్లు(ఆడ్మిషన్లు) లేవంటూ డబ్బులు వెనక్కి ఇస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యకం చేశారు. ఇప్పుడు చివరి నిమిషంలో ఫీజు డబ్బులు వెనక్కి ఇస్తే తమకు సీట్లు ఎక్కడ దొరుకుతాయని కళాశాల యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. వారి ఆందోళనకు విద్యార్థి సంఘాలు తోడవ్వడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
అసలు ఈ గోడవకంతటికి ప్రభుత్వ వైఖరినే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం, రద్ధుకు ప్రభుత్వం అనుమతించకుండా ఇబ్బంది పెట్టడటంతోనే ఈ సీట్ల కొరత సమస్య ఎదురైందని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. జేఎన్‌టీయూ, ఏఐసీటీఈ ఆమోదం ఉన్నప్పటికి, హైకోర్టు (High Court) సైతం అనుకూలంగా ఉత్తర్వులిచ్చినప్పటికి ప్రభుత్వం మాత్రం సీట్లు పెంచుకోవడానికి అనుమతి నిరాకరిస్తుండటంతో సీట్ల సంఖ్యలో ప్రతిష్టంభన ఏర్పడిందంటున్నాయి.
ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహారిస్తుండటం అంతిమంగా విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్న వాదన వ్యక్తమవుతుంది. ఈ పరిణమాలపై ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి సీట్ల పెంపు సమస్యలపైన, కౌన్సిలింగ్ తేదీల పొడిగింపుపైన తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకుని, విద్యార్థులు నష్టపోకుండా చూడాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.